ప్రేక్షకులు సమ్మతమే నని చాటిన విజయమిది: దర్శకుడు గోపీనాథ్ రెడ్డి
మంగళవారం, 28 జూన్ 2022 (15:32 IST)
dir- Gopinath Reddy
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ "సమ్మతమే". చాందిని చౌదరి కథానాయిక. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పీపుల్స్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న నేపధ్యంలో దర్శకుడు గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న సమ్మతమే సక్సెస్ విశేషాలివి.
- ప్రేక్షకుల నుండి వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ప్రేక్షకుల రెస్పాన్స్ పూర్తిగా సమ్మతమే.
- ఏ కథ చెప్పినా బలమైన పాయింట్ వుండాలని అనుకున్నాను. సమ్మతమే పాయింట్ బావుంటుందని మొదట ఈ లైన్ అనుకోని తర్వాత పూర్తి స్థాయిలో బిల్డ్ చేశా.
- నేను ఎంబీఏ చేశాను. ఇంటర్ తర్వాత అన్నపూర్ణలో మూడు నెలల ఫిల్మ్ క్రాష్ కోర్స్ చేశాను. డిగ్రీ చేస్తూ షార్ట్ ఫిల్మ్ చేసి, ఎంబీఏ చేస్తూ కథ రాసుకొని ఎంబీఏ పూర్తవ్వగానే సినిమా మొదలుపెట్టాను.
- షార్ట్ ఫిలిమ్స్ కి బిగ్ స్క్రీన్ కి తేడా వుంది. మొదట ఒక గంట కంటెంట్ ని యంగేజింగా చేస్తున్నానలేదా అని చెక్ చేసుకున్నాను. ఒక మంచి ప్రోడక్ట్ ని బయటికి తీసుకోస్తాననే నమ్మకం కుదురిన తర్వాతే సమ్మతమే మొదలుపెట్టాను.
= సమ్మతమే పై వచ్చిన విమర్శ ఏంటంటే.. ఫ్లాట్ నేరేషన్ అని అన్నారు. అయితే ఫ్లాట్ నేరేషన్ కూడా ఒక నేరేషన్ స్టయిలే. నాన్ లీనియర్ గా అక్కడిది ఇక్కడ కట్ చేసి జంప్స్ చేసి చెప్పొచ్చు. ఇలా ఐతే కథానాయకుడితో కనెక్షన్ మిస్ అయిపోతుంది. అతడి ఎమోషన్ ని ఆడియన్ ఫీల్ అవ్వలేడు. అందుకే చాలా వరకూ ఫ్లాట్ నేరేషన్ స్టయిల్ ని ఫాలో అయ్యా.
- బిజినెస్ పరంగా చాలా హ్యాపీ. ఎక్కువ లాభాలు వచ్చాయని చెప్పను గానీ పెట్టిన ప్రతి రుపాయీ వచ్చింది.
- సొసైటీ బాలేన్నప్పుడు మారాల్సింది సొసైటీ గానీ అమ్మాయిలు కాదు' సినిమాలో ఈ డైలాగ్ హంట్ చేసింది. ఇది మంచి పాయింట్ కదా .,.దిన్ని ఎందుకు బలంగా చెప్పే ప్రయత్నం చేయలేదు అని కూడా అన్నారు. అయితే ఒక విషయాన్ని పాత్ర చెప్పినట్లు ఉంటేనే బావుంటుంది. దాన్ని బలవంతంగా హైలెట్ చేస్తూ చెబితే రుద్దుతున్నట్లు వుంటుంది. కొన్ని డైలాగులు బలంగా ఉంటాయని నాకు ముందే తెలుసు. అయితే క్యాజువల్ గా చెబితేనే దాని ఇంపాక్ట్ వుంటుంది. ఈ రోజు దాని గురించి మనం మాట్లాడుతున్నామంటే కారణం అదే.
- మరీ లైటర్ వెయిన్ లో చెప్పడానికి కారణం.. బేసిగ్గా సినిమా కథలు డబ్బులు, హత్యలు, కుట్రలు, పగలు, మోసాలు చుట్టే ఎక్కువగా తిరుగుతాయి. వర్షం పడే ముందు చల్లగాలికి రైడ్ మీద వెళ్లే ఒక ఆహ్లాదకరమైన సినిమా తీయాలని అనుకున్నా. లైటర్ వెయిన్ ఎమోషన్స్ అందరిలోనూ వుంటాయి. వాటిని ద్రుష్టి లో పెట్టుకొని కథ చేయాలనేది నా ఆలోచన.
- పెళ్లి చూపుల్లో అవమానించిన అబ్బాయి,,. తర్వాత సీన్ లోనే ఆ అబ్బాయి ప్రేమలో అమ్మాయి పడినట్లు చూపించడానికి కారణం.. నిజంగా ప్రేమించడానికి కారణాలు వుండవు. ఒక అమ్మాయి ఎందుకిష్టం అంటే అప్పుడు కారణాలు వెదుక్కుంటారు కానీ ప్రేమించడానికి కారణాలు వుండవు. కారణం కంటే ముందు పుట్టేదే ప్రేమ.
- ఈ కథ ముందు ఎవరికీ చెప్పలేదు. నేను,కిరణ్ అన్నదమ్ముల్లా వుంటాం. తనతో ఎప్పటి నుండో ట్రావెల్ అవుతున్నా. రాజా వారు రాణి గారు తర్వాత ఈ సినిమా చేయాలి. అయితే స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదు. ఈ గ్యాప్ లో తను ఎస్ఆర్ కళ్యాణ మండపం చేశారు. దీని తర్వాత సమ్మతమే మొదలుపెట్టాం.
- శేఖర్ చంద్ర చాలా సపోర్ట్ చేశారు. కొత్త వారమని ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు. మంచి ఆల్బమ్ ఇచ్చారు.
- యూత్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన స్పందన రావడం సర్ప్రైజ్ గా వుంది. ఇండస్ట్రీ నుండి కూడా చాలా అభినందించారు. రెండు మూడు అవకాశాలు కూడా వచ్చాయి.
- కొత్త ప్రాజెక్ట్స్ గురించి.. సబ్జెక్ట్లు రెడీగా వున్నాయి. ఒక ఫీమేల్ ఓరియంటెడ్ కథ కూడా వుంది. హీరోలంతా బిజీగా వున్నారు. వారి వీలు చూసుకొని మొదలుపెట్టాలి.
- నాకు అందరూ ఎంజాయ్ చేసేలా వుండే కథలు, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని వుంది