అవసరాల శ్రీనివాస్ తెలుగు పరిశ్రమకు కమీడియన్‌గా పరిచయమై ఆ తర్వాత 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకునిగా మారి తొలి చిత్రంతో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నారా రోహిత్, నాగ శౌర్యలు హీరోలుగా 'జ్యో అచ్యుతానంద" అనే చిత్రంలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఒక పక్క దర్శకుడిగా రాణిస్తూనే మరో పక్క కమీడియన్, హీరోగా పలు సినిమాల్లో నటిస్తున్నాడు అవసరాల శ్రీనివాస్.
ఈ కథ సారాంశం ఏంటంటే చిన్న వయసు నుండే సెక్స్‌ని అమితంగా ఇష్టపడే ఓ కుర్రాడు, వయసుతో సంబంధం లేకుండా సెక్స్‌లో పాల్గొంటూ, సెక్స్ కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే పాత్రలో అవసరాల శ్రీనివాస్ నటించబోతున్నాడు. నైజాంలో అతిపెద్ద డిస్ట్రిబ్యూట్ సంస్థ అయిన అభిషేక్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారు.