బాహుబలి చిత్రంతో ప్రపంచ సినీ ప్రేక్షకులను టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసిన రాజమౌళి.. బాహుబలికి సీక్వెల్ కూడా రూపొందించాడు. బాహుబలి- ది కన్‌క్లూజన్ పేరిట ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే బాహుబలి రిలీజైనప్పటి నుంచి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్న సినీ ప్రేక్షకులను వెంటాడుతూనే వుంది.
బాహుబలికి అన్నివిధాలా రక్షకుడిగావున్న కట్టప్ప, మహారాజుని చంపడం వెనుక కారణమేంటి? అన్నదానిపై క్లారిటీ ఇచ్చేశాడు హీరో ప్రభాస్. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ.. బహుశా భల్లాల దేవుడ్ని చంపబోయి చీకట్లో కట్టప్ప బాహుబలిని హతమార్చి వుంటాడని ప్రభాస్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ప్రభాస్ చెప్పినదానిలోనూ నిజముండే వుంటుందని సినీ జనం అనుకుంటున్నారు.