'బాహుబలి' రెండో భాగం రేటు చూసి బెంబేలెత్తిపోతున్న డిస్ట్రిబ్యూటర్స్!
గురువారం, 14 జులై 2016 (13:26 IST)
ఒకవైపు 'బాహుబలి రెండో భాగం' చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మరోవైపు... ఈ చిత్రం ప్రీ బిజినెస్ చర్చలు కూడా హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉండగానే.. 'బాహుబలి' తొలి భాగం రేటును తుడిచిపెట్టేలా రెండో భాగం రేటు చర్చలు జరుగుతుండటం గమనార్హం.
ప్రస్తుత క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్న ఈ చిత్రం 'బాహుబలి - ది కంక్లూజన్' కొత్త రికార్డులు నెలకొల్పేలా ఉంది. రెండో భాగం రేట్ చూసి పంపిణీదారులే బెంబేలెత్తిపోతున్నారట. కేవలం తమిళ హక్కులకే అక్షరాలా రూ.54 కోట్ల ధర పలుకుతోంది.
దీంతో తొలి భాగాన్ని స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి తమిళంలో విడుదల చేసిన ప్రభాస్ సన్నిహితుల సంస్థ అయిన యువీ క్రియేషన్స్ తాజా రేటు తెలిసి, 'తీసుకోవాలా..? వద్దా..?' అన్న విషయంపై ఓ "కంక్లూజన్"కి రాలేకపోతున్నారట.