బాహుబలి విజయం భారతీయ చలన చిత్ర నిర్మాతల్లో గొప్ప విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచిదని బల్లాలదేవ పాత్రధారి రానా చెప్పుకొచ్చారు. ఒక భాషలో మొత్తం దేశం కోసం సినిమా చేయడం మిగిలిన సినిమాలకంటే గొప్ప విషయమని బాహుబలి నిరూపించిందన్నారు. దమ్ము ధైర్యం ఉండి, గ్రేట్ సూపర్ హీరో లభిస్తే మధురై నిర్మాత అయినా నమ్మకంతో సినిమా తీస్తే చూడడానికి జనం ఉన్నారని పేర్కొన్నారు. బాహుబలి ది బిగినింగ్ అనూహ్యంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టిందని, ఇది తమలో నమ్మకాన్ని పెంచిందని తెలిపారు. ఈ చిత్రంలోని రెండు భాగాల నుంచి తాను నేర్చుకున్న దాని ఆధారంగా భవిష్యత్తులో పాత్రలను ఎంచుకుంటానని రానా చెప్పారు.