చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, 'సింహా', 'లెజెండ్` తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను గార్ల కాంబినేషన్‌లో వస్తోన్న మరో సూపర్ సెన్సేషనల్ మూవీ ఇది. మా ద్వారకా క్రియేషన్స్ బేనర్‌లో అత్యంత ప్రెస్టీజియస్‌గా, భారీ తారాగణంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఫిబ్రవరి సెకండ్ వీక్ నుండి ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సమ్మర్ స్పెషల్‌గా మే28న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదలచేస్తున్నాం`` అన్నారు.
సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్, సంగీతం: తమన్ ఎస్, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సమర్పణ: మిర్యాల సత్యనారాయణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.