ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బోయపాటికి ఛాన్స్..

శుక్రవారం, 12 అక్టోబరు 2018 (11:29 IST)
నందమూరి హీరో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత వివి వినాయక్‌తో కలిసి పనిచేయనున్నారని తెలిసింది. ఇప్పటికే వీరిద్దరి కాంబో చెన్నకేశవరెడ్డి హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు పదహారేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్. 
 
ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌లో బిజీగా వున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో పూర్తవుతుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలయ్య బోయపాటి సినిమాలో నటిస్తారని.. ఈ సినిమా పూర్తయ్యాకే ఎన్టీఆర్ వినాయక్‌తో సినిమా చేసే అవకాశం వున్నట్లు సినీ వర్గాల సమాచారం.
 
నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జీవిత కథ ఆధారంగా 'ఎన్టీఆర్' బయోపిక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోయపాటికి ఛాన్సిచ్చి.. తర్వాత వినాయక్‌తో కలిసి నటించాలన్న నిర్ణయానికి వచ్చేశారట. 
 
ఇందుకోసం వినాయక్ మంచి కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. దాంతో మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై నందమూరి అభిమానుల మధ్య అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు