శాతకర్ణి యుద్ధనేపథ్యం కలిగిన సినిమా. ఆ చిత్రదర్శకడు క్రిష్ మొరాకో, జార్జియా వంటి విదేశాల్లోనూ, భారత్ లోని కొన్ని ప్రాంతాల్లోనూ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించారు. కాబట్టి బాలకృష్ణ మొరాకోలో శిక్షణ పొందిన గుర్రాలను, జార్జియాలోని పురాతన పర్వత ప్రాంత గుర్రాలతోనూ గుర్రపుస్వారీ చేయవలసి వచ్చింది. కానీ ఈ సినిమాలో గుర్రపుస్వారీ కూడా బాలయ్యకు కేక్ వాక్‌లాగా అయిందని సమాచారం.
బడ్జెట్ పరిమితుల కారణంగా క్రిష్ పరిమిత దినాల్లోనే షూటింగ్ చేయవలసి వచ్చింది. దీంతో బాలకృష్ణ రోజుకు 8 నుంచి 9 గంటలపాటు గుర్రంపైనే ఉండిపోవలసి వచ్చిందట. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ బాలయ్య అద్భుతమైన రైడర్. గుర్రాలతో బాలయ్య సులువుగా స్వారీ చేయడంపై మొరాకోలోని అశ్వ శిక్షకులే దిగ్భ్రాంతి చెందారట. గుర్రాన్ని గ్యాలప్ తీయించడంలో, పరుగెత్తించడంలో ఆయన ప్రతిభ నన్ను ఆశ్చర్యపరిచింది. కొద్ది గుర్రాలయితే తక్కువ సమయంలోనే 100 నుంచి 120 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి కానీ బాలయ్య నిజమైన వృత్తి నిపుణుడుగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా గుర్రాలతో వ్యవహరించారు అని క్రిష్ తెలిపారు.
రామోజీ ఫిలిం సిటీలో పతాక సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య 90 డిగ్రీల సమాంతరంగ గుర్రాన్ని పైకి లేపటం నన్నుదిగ్భ్రాంతి గొలిపించింది, యుద్ధ సన్నివేశాల షూటింగ్ మొత్తంలో బాలకృష్ణ ఎన్నడూ డూప్‌లను ప్రోత్సహించలేదని క్రిష్ చెబుతూ పనిలో బాలయ్య అంకిత భావంపై ప్రశంసల వర్షం కురిపించారు.