సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

ఐవీఆర్

శుక్రవారం, 10 జనవరి 2025 (20:12 IST)
సారీ చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ తితిదే చైర్మన్ బి.ఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. క్షమాపణలు చెప్పడంలో తప్పులేదు కానీ చెప్పినంతమాత్రాన చనిపోయినవారు బతికిరారు కదా అంటూ ప్రశ్నించారు. ఎవరో ఏదో మాట్లాడితే దానిపై స్పందించాల్సిన పనిలేదంటూ పరోక్షంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి కౌంటర్ వేసారు.
 
తిరుపతి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల విషయంలో ప్రభుత్వం క్షమాపణలు చెబుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అంతేకాదు ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు తితిదే ఈవో, చైర్మన్, సభ్యులందరూ క్షమాపణలు చెప్పాలని కూడా ఆయన సూచన చేసారు. ఐతే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పినట్లు సారీ చెప్పే విషయంలో తితిదే చైర్మన్ పైవ్యాఖ్యలు చేసారు.

పవన్‌ కళ్యాణ్‌కు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కౌంటర్

క్షమాపణలు చెప్పడంలో తప్పు లేదు

చెప్పినంత మాత్రాన చనిపోయినవాళ్లు బతికిరారు కదా

ఎవరో ఏదో మాట్లాడితే దానిపై స్పందించాల్సిన అవసరం లేదు

- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు pic.twitter.com/PE1RKnNHs1

— BIG TV Breaking News (@bigtvtelugu) January 10, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు