అయ్యా చిరంజీవిగారూ.. మా సంసారంలో నిప్పులు పోయొద్దు : నిర్మాత పీవీవీ

శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (08:44 IST)
మెగాస్టార్ చిరంజీవికి ప్రముఖ పారిశ్రామికవేత్త, టాలీవుడ్ నిర్మాత పీవీపీ వరప్రసాద్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మా సంసారంలో నిప్పులు పోయొద్దంటూ హితవు పలికారు. ఏం మెగాస్టార్ చిరంజీవిగారు చేయగా.. మీరు చేయలేరా అంటూ నా భార్య నిలదీస్తోందంటూ పీవీపీ వాపోయారు. ఇంతకీ చిరంజీవికి పీవీపీ అలా విజ్ఞప్తి చేయడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. 
 
టాలీవుడ్ దర్శకుడు సందీప్ వంగా. అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడిగా అవతారమెత్తాడు. ఈయన ప్రారంభించిన బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్‌కు ఇపుడు టాలీవుడ్ ఫిదా అయిపోయింది. ఈ ఛాలెంజ్‌కు అతిపెద్ద స్పందన వచ్చింది. 
 
ఇంట్లోని మ‌హిళ‌ల‌తో ఇంటి ప‌నులు చేయించ‌కండి అంటూ మొదలైన ఈ ఆన్‌లైన్ ఛాలెంజ్‌లో టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేశ్ తదితరులు ఎంతో మంది పాల్గొన్నారు. మరికొందరు సినీ స్టార్స్, రాజకీయ నాయకులను దాన్ని పాస్ చేశారు.. చేస్తున్నారు కూడా. 
 
ఈ నేపథ్యంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన మెగాస్టార్ చిరంజీవి.. తన ఇంటిని శుభ్రం చేశారు. ఆ తర్వాత ఆయన స్వయంగా వంటగదిలోకి వెళ్ళి స్వయంగా ఓ ఉల్లిపాయ పెసరట్టును వేశారు. పైగా, అచ్చం ఓ చేయి తిరిగి హోటల్ చెఫ్‌లాగానే ఆయన దోశను వేయడం గమనార్హ. ఆ పెసరట్టు దోసెను తన తల్లికి ఇవ్వగా... ఆమె దాన్ని తన బిడ్డకు తినిపించింది. ఆ తర్వాత తాను ఆరగించింది. 
 
దీనికి సంబంధించిన వీడియో చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, మరో తెరాస మంత్రి కేటీఆర్, తన స్నేహితుడు సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఛాలెంజ్ విసిరారు. ఈ వీడియోపై టాలీవుడ్ నిర్మాత, వైకాపా నేత, పారిశ్రామికవేత్త పీవీపీ వరప్రసాద్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టగా అదిప్పుడు వైరల్ అవుతోంది.
 
'చిరంజీవిగారు, ఏదో ఇంట్లో అంట్లు తోమగలం, గచ్చు కడగగలం. కానీ మీరిలా స్టార్ చెఫ్‌లా నలభీమ పాకము వండుతుంటే, మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీకేమిటి అంటున్నారు.. మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్‌గారు.. జోక్స్ పక్కన పెడితే.. మీ ప్రేరణ ప్రశంసనీయం సర్' అని ట్వీట్‌తో చిరంజీవిపై పీవీపీ జోక్ చేశారు. 

 

చిరంజీవి గారు,ఏదో ఇంట్లో అంట్లు తోమగలము,గచ్చు కడగగలము కానీ మీరిలా స్టార్ చెఫ్ లా నలభీమ పాకము వండుతుంటే, మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీకేమిటి అంటున్నారు..మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్ గారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు