రొమాంటిక్ సన్నివేశాలు చేసేటపుడు టెంప్ట్ అయ్యాను...

సోమవారం, 1 జులై 2019 (10:09 IST)
వెండితెరపై శృంగార సన్నివేశాలను పండించడంలో బాలీవుడ్ నటి రాధికా ఆప్టేకు మించివారు లేరని చెప్పొచ్చు. అందాలు ఆరబోతలోనూ ఆమె కంటే ఇతరులు కాస్త  తక్కువనే చెప్పుకోవాలి. అయితే, సినిమాల్లో కథ డిమాండ్ మేరకు పడక సీన్లలో నటించే సమయంలో టెంప్ట్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయనీ, అలాంటి సమయంలో తాను నిగ్రహించుకోవడం మినహా మరేం చేయలేనని రాధికా ఆప్టే చెప్పుకొచ్చింది. 
 
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నేహా ధుపియా నటిస్తున్న ఓ టాక్ షోకు రాధికా ఆప్టే ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా నేహా అడిగిన ప్రశ్నలకు రాధికా ఆప్టే ఏమాత్రం తడుముకోకుండా సమాధానాలు చెప్పింది. 
 
'రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో ఎప్పుడైనా "ఆ" ఫీలింగ్స్ క‌లిగిన‌ సందర్భాలున్నాయా? అని నేహా అడిగింది. దీనికి రాధికా సమాధానిమిస్తూ, 'అఫ్‌కోర్స్‌.. అది స‌హ‌జం. నా కెరీర్‌లో అలాంటి ఘ‌ట‌న‌లు ఉన్నాయి. న‌ట‌న‌లో భాగ‌మే క‌దా అని అలాంటి స‌న్నివేశాల్లో ఎలాంటి ఫీలింగ్ లేకుండా న‌టించేయ‌లేం. నిజానికి ఫీల్ అయితేనే స‌న్నివేశం స‌హజంగా వ‌స్తుంద‌' అని చెప్పుకొచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు