మాజీ ఎమ్మెల్సీ కవితను అధికారికంగా బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేశారు. ఆపై ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీనితో, కుటుంబ సంబంధాలు తప్ప, కేసీఆర్‌తో కవితకు ఉన్న రాజకీయ సంబంధాలు తెగిపోయాయి. గతంలో ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశం వుందని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కానీ ప్రస్తుతం అది జరిగేట్లు లేదు. ఎందుకంటే.. కవిత బహిరంగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని, తన జైలు శిక్షకు బీజేపీని విమర్శించారు.