హ్యాకర్స్‌కు షాకిచ్చిన హీరోయిన్.. నెట్‌లో న్యూడ్‌ ఫోటోలు అప్‌లోడ్

మంగళవారం, 18 జూన్ 2019 (15:51 IST)
సాధారణంగా చాలా మంది అమాయికులు హ్యాకర్స్ బారినపడుతుంటారు. టెక్నాలజీలోని లొసుగులను తమకు అనుకూలంగా మలుచుకునే హ్యాకర్స్.. అనేక మందిని మోసం చేస్తుంటారు. కేవలం ఆర్థికంగానేకాకుండా, వ్యక్తిగత గోప్యతకు భంగం కలింగించేలా నడుచుకుంటారు.

ఈ క్రమంలో ఓ హీరోయిన్‌కు షాకివ్వాలని హ్యాకర్స్ భావించారు. కానీ, ఆ హీరోయిన్ ఏకంగా హ్యాకర్స్‌కే తేరుకోలేని షాకిచ్చింది. తన న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. వీటిని చూసిన హ్యాకర్స్ దిమ్మతిరిగిపోయారు. ఇంతకీ న్యూడ్ ఫోటోలను నెట్‌లో అప్‌లోడ్ చేసిన హీరోయిన్ ఎవరో ఇపుడు తెలుసుకుందాం. 
 
హాలీవుడ్ న‌టి బెల్లా థ్రోన్ ఫోన్‌ను కొంద‌రు ఆక‌తాయిలు హ్యాక్ చేశారు. ఆమె న్యూడ్ ఫోటోల‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆమెను బెద‌రించ‌డం మొద‌లు పెట్టారు. వారి అవ‌స‌రం తీర్చ‌కుంటే ఆ ఫోటోల‌ను నెట్‌లో అప్‌లోడ్ చేస్తామ‌ని బెదిరించారు. దీంతో ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు. ఇలా రెండు మూడు రోజుల పాటు నరకయాతన అనుభవించింది. 
 
అయితే చివ‌ర‌కు ధైర్యం చేసి స‌ద‌రు హ్యాక‌ర్స‌ట్‌కు పెద్ద షాకే ఇచ్చింది. ఇంత‌కు ఆమె ఏం చేసిందో తెలుసా!.. ఎవ‌రో త‌న ఫోటోల‌ను అప్‌లోడ్ చేస్తాన‌ని బ్లాక్‌మెయిల్ చేయ‌డ‌మేంటి? అని ఆలోచించిన ఈ అమ్మ‌డు త‌న న్యూడ్ ఫోటోల‌ను హ్యాకర్స్ కంటే ముందుగా త‌న ఇన్‌స్టా‌గ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసింది. దీంతో బెల్లా థ్రోన్ చేసిన ప‌నికి షాక్ అవ‌డం హ్యాకర్స్ వంతైంది. బెల్లా థ్రోన్ న్యూడ్ ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు