బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ "భైరవం" ప్రతి అప్‌డేట్‌తో బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే పవర్ ల్ పోస్టర్లు, యాక్షన్ తో నిండిన టీజర్, రెండు సూపర్ హిట్ సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి పాట రొమాంటిక్ మెలోడీగా కాగా, రెండో సింగిల్ పవర్ ఫుల్ డివోషనల్ సాంగ్ గా అలరించింది.