హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్టు!

వరుణ్

మంగళవారం, 11 జూన్ 2024 (11:41 IST)
కన్నడ స్టార్ హీరో దర్శన్ ఓ హత్య కేసులో అరెస్టు అయ్యారు. ఈ కేసులో ఆయనను మంగళవారం కర్నాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దర్శన్‌ను మైసూరు ఫామ్ హౌస్‌లో ఉండగా అరెస్టు వార్తలు వస్తున్నాయి. దర్శన్‌కు పెళ్ళైనా పవిత్ర గౌడ అనే నటితో సన్నిహితంగా ఉంటున్నాడు. 
 
అయితే పవిత్ర గౌడకు రేణుక స్వామి అనే వ్యక్తి అభ్యంతకర మెసేజ్‌లు పంపి పవిత్రను భయపెట్టడం లాంటిది చేసాడని, పవిత్ర ఈ విషయం దర్శన్‌కు చెప్పడంతో దర్శన్ రేణుక స్వామిని మర్డర్ చేయించినట్లు తెలుస్తుంది. ఈ హత్య కేసులో ఇప్పటికే కొంతమంది పోలీసులు అరెస్టు చేయగా, దర్శన్ చెప్తేనే చేసినట్టు, తమకు ఏం తెలీదని, దర్శన్ చంపమని చెప్తేనే ఈ పని చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో దర్శన్ మెడకు ఉచ్చు బిగుసుకుంది. 
 
మరోవైపు, ఇప్పటికే ఈ కేసులో 9 మందిని అరెస్టు చేసారని సమాచారం. అయితే ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై దర్శన్, ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు