స్వీటీ కూ లో చేరిన వారం లోపే దాదాపు 25 వేల మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. అయితే తాజాగా అనుష్క తన బిఎఫ్‌ఎఫ్ (బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్) తో ఉన్న త్రోబ్యాక్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. జీవితం గడుస్తున్న కొద్దీ మా మార్గాలు మారవచ్చు, కాని స్నేహితుల మధ్య బంధం ఎప్పుడూ బలంగా ఉంటుంది అని అనుష్క మంచి క్యాప్షన్ ఇచ్చారు. ఆమె పోస్ట్ చేసిన వెంటనే, అభిమానులు ప్రేమతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాపరంగా చెప్పాలంటే లేడీ ఓరియంటెడ్ చిత్రంగా రానున్న ఈ సినిమాలో స్వీటీ ఇద్దరి కవల పిల్లలతో ఒంటరి తల్లిగా కనిపించనుందట. త్వరలోనే ఈ విషయాలు కూడా కూ లో తెలపనుందని తెలుస్తోంది.