పంటలు చేతికొచ్చి.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రాకతో ప్రతి ఇంటి లోగిళ్లన్నీ కళకళలాడుతున్నాయి.అలాంటి అందరికి ఇష్టమైన సంక్రాంతి విశిష్టతను తెలియచేసెలా ఓ ప్రత్యేక గీతాన్ని "మన సంక్రాంతి 2021" పేరిట గ్రీన్ మెట్రో ఇన్ ప్రా టెక్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రై లిమిటెడ్ చైర్మన్ శ్రీ బొడ్డు అశోక్ నిర్మించారు.
తాజాగా క్రేజీ అంకుల్స్ సినిమా సెట్‌లో సింగర్ మనో, పాపులర్ యాంకర్ మరియు నటి శ్రీముఖి, రాజా రవీంద్ర చేతుల మీదగా ఈ పాటను ఆవిష్కరించారు.శ్రేయాస్ మీడియా యూట్యూబ్ చానెల్ ద్వారా ఈ పాట విడదలయి, నెటిజెన్స్‌ను ఆకట్టుకుంటోంది.
ప్రముఖ నటీనటులు సుహాసిని ,భానుచందర్ లపై కలర్ ఫుల్‌గా రూపొందించిన ఈ పాటకు ఫేమస్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ అర్థవంతమైన సాహిత్యాన్ని అందించగా భోలో షావలి, అంజనా సౌమ్య గీతాన్ని ఆలపించారు. సంక్రాంతి సందండినంతా నింపుకున్న ఈ పాట ముందుగానే పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది.
సుహాసిని మణిరత్నం,భానుచందర్, అక్షిత, శ్రీతిక్ బాబువ, పరమేష్ తదితరులు నటించిన ఈ పాటకు సాహిత్యం: కాసర్ల శ్రామ్, సింగర్స్ : భోలే షావలి, అంజనా సౌమ్య, ప్రోగ్రామింగ్- మిక్సింగ్: మదన్ ఎస్.కె, డిఓపి - ఎడిటింగ్-డిఐ : జనతా బాబు, కొరియోగ్రఫీ : దుర్గేష్, టోని కిక్, రఘుజాన్, డ్రోన్ : సురేష్ డెగవత్,