అమెరికాలో మరో రికార్డు సాధించిన‌ 'భరత్ అనే నేను'(Video)

సోమవారం, 30 ఏప్రియల్ 2018 (19:06 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన భ‌ర‌త్ అనే నేను చిత్రం రికార్డు స్థాయి క‌లెక్ష‌న్లతో తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లోను దూసుకెళుతోంది. అమెరికాలో అయితే... బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంద‌ని చెప్ప‌చ్చు. తాజాగా ఈ సినిమా అమెరికాలో 3 మిలియన్ మార్క్‌ను దాటింద‌ని నిర్మాత డీవీవీ దానయ్య తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియ‌చేసారు. అమెరికాలో 3 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన మహేష్ బాబు తొలి సినిమా ఇదే కావ‌డం విశేషం. 
 
మ‌హేష్ నటించిన 'శ్రీమంతుడు' యూఎస్‌లో 2.8 మిలియన్ డాలర్లను రాబట్టగా, దాన్ని 'భరత్ అనే నేను' అధిగమించింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం, ఫ‌స్ట్ వీక్‌లో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 161.28 కోట్లు గ్రాస్ క‌లెక్ట్ చేసింద‌ని నిర్మాత స‌క్సస్ మీట్‌లో తెలియ‌చేసారు. ఇది అబ‌ద్ధం కాద‌ని... ఇది నిజం అని నిర్మాత‌ దానయ్య వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే... రామ్ చ‌ర‌ణ్  'రంగస్థలం' అమెరికాలో 3.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. మ‌రి..రంగ‌స్థ‌లం రికార్డుని భరత్ అనే నేను క్రాస్ చేస్తుందా..? లేదా..?  అనేది ఆస‌క్తిగా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు