సినిమా చిన్నాదా పెద్దదా అనే తేడాలేదు. ప్రేక్షకులు బాగా తెలివిమీరారు. ఈ మాటలు ప్రతీ దర్శకుడు, నిర్మాత, హీరో చెబుతున్నవే. కానీ.. చెప్పినట్లు రివర్స్‌లో వారు పనులు వుంటున్నాయి. పెద్ద హీరోలు, పెద్ద సంస్థ, పెద్ద దర్శకుడు అంటూ కాంబినేషన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. బ్రహ్మోత్సవం విషయంలోనూ అదే జరిగింది.
సరే.. ఏదిఏమైనా ఆ చిత్రంతోపాటుగా వచ్చిన డబ్బింగ్ సినిమా 'బిచ్చగాడు' కలెక్షన్లను కొట్టేస్తుంది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్ళు రాబట్టింది. కేవలం పరిమిత ఆర్టిస్టులు, లొకేషన్లలో తీసిన ఈ సినిమా గురించి పలువురు ఇలా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అడ్డాల చంటి మాటల్లో అయితే... బాగుంటే బిచ్చగాడు.. లేదంటే బ్రహ్మోత్సవం... కొటేషన్ బాగుంది గురూ అంటున్నారు ఇది విన్నవారు.