బిగ్ బాస్ నిర్వాహకులకు ముందుస్తు బెయిల్...

గురువారం, 25 జులై 2019 (10:06 IST)
బిగ్ బాస్ నిర్వాహకులకు ముందస్తు బెయిల్ మంజూరైంది. ప్రముఖ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే రియాల్టీ షో బిగ్ బాస్ హౌస్ ఓ బ్రోతల్ హౌస్ అంటూ, ఈ కార్యక్రమం నిర్వాహకులు క్యాస్టింగ్ కౌచ్ అని ప్రోత్సహిస్తున్నారని ప్రముఖ యాంతర్ శ్వేతారెడ్డి ఫిర్యాదు చేశారు. 
 
ఈ నెల 13న శ్వేతారెడ్డి ఫిర్యాదు ఇవ్వగా, శ్యామ్, రవికాంత్‌, రఘు, శశికాంత్‌‌లపై పోలీసులు కేసులు పెట్టారు. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు ఈ కేసును నమోదు చేయగా, బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఇన్‌‌ఛార్జి శ్యామ్‌తో‌పాటు మరో ముగ్గురిపై కేసు రిజిస్టర్ అయిన సంగతి తెలిసిందే.
 
నాటి నుంచి పోలీసుల విచారణకు హాజరుకాని వారు, బుధవారం నాంపల్లి కోర్టుకు హాజరై, ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లను దాఖలు చేశారు. తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, పోలీసుల విచారణకు సహకరిస్తామని చెప్పారు. దీంతో వారికి ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో స్టార్‌ మా చానెల్ అడ్మిన్‌ హెడ్‌‌కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు