నా ఛాతీ లోపల చేయి పెడతావా? 'బిగ్ బాస్' ఇంట్లో భానుశ్రీ రచ్చరచ్చ

శుక్రవారం, 13 జులై 2018 (17:27 IST)
మంచివారు-చెడ్డవారు టాస్క్ టాపు లేపింది. రచ్చ రచ్చ కూడా అయింది. ఈ టాస్కులో భానుశ్రీ ఒక యాపిల్‌ను తన ప్యాంటులో దాచిపెట్టుకున్నది. దాన్ని లాక్కునేందుకు కౌశల్ ప్రయత్నించాడు. కౌశల్ అనగానే ఇప్పటికే ఓ టైపు ముద్ర పడిపోయింది. దానికితోడు ఈ టాస్కులో అతడు ప్రవర్తించిన తీరు కూడా మామూలుగా లేదు. భానుశ్రీ వద్ద దురుసుగా ప్రవర్తించాడు. 
 
యాపిల్‌ను ఎలాగైనా లాక్కోవాలని అతడు చేసిన పెనుగులాటలో అతడి చేయి కాస్తా అనుకోకుండా భానుశ్రీ ఛాతికి తగిలింది. ఇది కాస్తా భానుశ్రీకి బాగా కోపం తెప్పించింది. రచ్చరచ్చ చేసింది. లోపల చేయిపెడతావా?ఛాతి లోపలకు చేయి పెడతావా అంటూ కేకలు వేసింది. ఇక భానుశ్రీ కేకలతో తేజస్వి కూడా జత కలిసింది. అతడి క్యారెక్టర్ అలాంటిదేనంటూ మండిపడింది. 
 
ఐతే కౌశల్ తను తాకాలని తాకలేదనీ, అనుకోకుండా తగిలిందని చెప్పినా వినిపించుకోలేదు. మరోవైపు సామ్రాట్ కూడా దీప్తి సునైనాను జైల్లో పెట్టేందుకు ఆమెను బంధించే క్రమంలో ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ నానా హంగామా చేశాడు. చివరికి తనీష్, కౌశల్ అడ్డు తగిలి ఆ వ్యవహారాన్ని జరుగకుండా చేయశారు. మొత్తమ్మీద బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులతో ఇంటి లోపలివాళ్లు నానా హంగామానే చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు