బిగ్ బాస్‌కు సత్తిరి బిత్తిరి వెళ్లవద్దన్నాడు.. శివజ్యోతి సంచలన వ్యాఖ్యలు

బుధవారం, 30 అక్టోబరు 2019 (15:07 IST)
బిగ్ బాస్ హౌస్ నుంచి శివజ్యోతి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. తీన్మార్ సావిత్రిగా పాపులర్ అయిన శివజ్యోతి.. బిత్తిరి సత్తిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తామిద్దరం వీ6 ఛానల్‌లో వున్నప్పుడు అన్నాచెల్లెలుగా కలిసివుండేవాళ్లం. ఆయన ఏమి చేసినా.. మొదట తన అభిప్రాయాన్నే అడిగేవారు. తనకు బిత్తిరి సత్తితో వున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. తన నిర్ణయంపై బిత్తిరి సత్తికి అంత నమ్మకం ఉండేదని శివజ్యోతి చెప్పుకొచ్చింది.
 
అంతేకాదు తాను బిగ్‌బాస్ రియాల్టీ షోకు పోతానంటే.. బిత్తిరి సత్తి వద్దని చెప్పాడు. కానీ నేను ఒక మహిళగా తన వరకు మంచి గుర్తింపును సంపాదించుకున్నాను. ఇంకా ఏదైనా సాధించాలనే కసితోనే తాను బిగ్‌బాస్ ప్రోగ్రామ్‌ వెళ్లాను. ఇక బిగ్‌బాస్‌లోకి వెళుతున్నట్టు తాను బిత్తిరి సత్తికి చెప్పలేదు. ఇక మహిళ నా కెరీర్ ఎలా సాగుతుందనేది చెప్పలేను.
 
ఒకవేళ కెరీర్ ఎండ్ అయితే.. తన భర్త పిల్లలతో సుఖంగా గడుపుతానని చెప్పుకొచ్చింది. కానీ బిత్తిరి సత్తి మాత్రం ఎన్నో ఆశలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆయన అక్కడ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాని చెప్పింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు