సోహెల్‌కు ఐలవ్యూ చెప్పిన ఇనయా.. వీడియో వైరల్

మంగళవారం, 27 డిశెంబరు 2022 (22:31 IST)
Inaya Sultana
బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పించిన సయ్యద్ సోహెల్ ర్యాన్. అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్  బాస్ తెలుగు ఆరో సీజన్‌లోకి అడుగుపెట్టింది బ్యూటీఫుల్ ఇనయా సుల్తానా. తొందర్లోనే హౌజ్ నుంచి బయటకు వెళ్తుందనుకున్న ఇనయా ఊహించని విధంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. హౌజ్‌లో ఆర్జే సూర్యతో సన్నిహితంగా ఉన్న ఇనయా తాజాగా సోహెల్‌కు లవ్ ప్రపోజ్ చేసి షాకిచ్చింది. 
 
బిగ్ బాస్ ఆరో సీజన్ 14వ వారం ఇనయా హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. ప్రస్తుతం లక్కీ లక్ష్మణ్ సినిమాకు హీరోగా చేస్తున్న బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్ ర్యాన్‌కు ప్రపోజ్ చేసి షాకిచ్చింది. 
 
బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ నీతోనే మాట్లాడుతున్నాను.. నేను ఏం చేయలేదు అని ఇనయా అంటే సోహెల్ షాకయ్యాడు. ఇనయా ప్రపోజ్ తో సోహెల్ చాలా సిగ్గుపడుతూ అయోమయంగా ఉన్నాడు. అలాగే తనకు ఇప్పటివరకు ఎవరు ప్రపోజ్ చేయలేదని చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు