జబర్దస్త్ కామెడీ షో నటుడికి ప్రమాదం.. ఎలాగో తెలుసా?

గురువారం, 1 అక్టోబరు 2020 (15:05 IST)
జబర్దస్త్ కామెడీ షో నటులు అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ వుంటారు. తాజాగా ఓ జబర్దస్త్ కమెడియన్‌కు అనుకోని ప్రమాదం జరిగింది. అది కూడా జబర్దస్త్ షోలో కాదు.. బయటెక్కడో. ఎవరబ్బా అనుకుంటున్నారా.. ఇంకెవరు మన ముక్కు అవినాష్‌కే. ఈయన ఇప్పుడు జబర్దస్త్ నుంచి బిగ్ బాస్‌కు వచ్చాడు. అక్కడే తన అల్లరి కొనసాగిస్తున్నాడు. 
 
బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు రచ్చ చేస్తూనే ఉన్నాడు అవినాష్. అందరితో కలిసిపోయాడు.. నవ్వుతున్నాడు.. నవ్విస్తున్నాడు. ఈయన దూకుడు చూస్తుంటే కనీసం పది వారాలు అయితే సేఫ్‌గానే ఉంటాడనిపిస్తుంది. ఇంట్లో అందరికీ ఫేవరేట్ కావడంతో కనీసం నామినేషన్స్‌లోకి కూడా రావట్లేదు ఈయన. 
 
ఇదిలా ఉంటే తాజాగా ఈయన గాయపడ్డాడు. బిగ్ బాస్ హౌస్‌లో టాస్క్‌లో భాగంగా అవినాష్‌కు అనుకోని ప్రమాదం జరిగింది. కిల్లర్ కాయిన్స్ అంటూ బిగ్ బాస్ మొదలు పెట్టిన టాస్క్‌లో చాలా మందికి దెబ్బలు తగిలాయి. అఖిల్, మోనాల్, సుజాత లాంటి వాళ్లు గాయాల పాలయ్యాయి. ఇక అవినాష్ అయితే ఏకంగా కింద పడిపోయాడు. కాలు బెనకడంతో ఈయన్ని మోసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. 
 
వెంటనే వైద్యులు రావడంతో వాళ్ల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకుంటున్నాడు అవినాష్. కొత్త ప్రోమోలో కూడా ఈయన కనిపించడం లేదు. గాయం కాస్త పెద్దదే కావడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు