బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో దొంగలు దోచిన వస్తువులు టాస్క్ అల్లకల్లోలం సృష్టించింది. టాస్క్‌లో మితి మీరిన హింసకు దారి తీయడంతో బిగ్‌బాస్ సీరియస్ అయ్యాడు. అంతేకాకుండా టాస్క్‌ను రద్దు చేసి అందుకు కారణమైన ఇద్దరు సభ్యులకు జైలుశిక్ష విధించాడు. కెప్టెన్ వరుణ్‌కు ఇది ఒక తలనొప్పి అయితే.. భార్య పోరు ఎక్కువైనట్టు కనిపిస్తున్నది. బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో వరుణ్, వితిక మధ్య గట్టిగానే గొడవ జరిగింది.
ఆసక్తిగా సాగుతున్న బిగ్‌బాస్ షోలో దొంగలు దోచిన నగరం టాస్క్‌లో భాగంగా వితిక హౌస్ మేట్స్‌పై ఒక రేంజ్‌లో రెచ్చిపోయింది. దీనితో వరుణ్ సందేశ్ వితిక ప్రవర్తనపై వితికకి చెప్తున్నాడు. వీరిద్దరి మధ్య ఒకానొక సమయంలో బీకరమైన యుద్ధం జరిగింది అని చెప్పవచ్చు. వరుణ్‌కి దూరంగా ఓ మూలన కూర్చుని ఏడుస్తున్న వితికాను కామన్‌సెన్స్ పెట్టి ఆలోచించు అని వరుణ్ చెప్పడం గొడవకు కారణమైంది.
తనతో టైమ్ స్పెండ్ చేయి అంటే చేయట్లేదని వితికా అరవగా.. మనం వచ్చింది బిగ్ బాస్ షోకి అని హనీమూన్‌కి కాదని.. అది నీకు అర్థమవుతుందా అంటూ వితికపై ఫైర్ అయ్యాడు. దీంతో వితికా.. నేను నాతోనే ఉండమని అనడంలేదు. నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వెళ్లి మాట్లాడుకో అంటూ గట్టిగా అరిచి చెప్పింది. దీంతో వరుణ్ కూడా సీరియస్ అయ్యాడు. ప్రతి దాన్ని బూతద్దంలో చూస్తే ఇలాగే ఉంటుంది. ప్రతిదీ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అంటూ భార్య పై తనకున్న కోపాన్ని ప్రదర్శించాడు.
దీంతో వితిక తాను ఎవరి గురించి మారనని తనతో మాట్లాడకు.. వదిలేయ్ అంది. ఇలా మాట మాట పెరగడంతో గొడవ పెద్దదిగా మారిపోయింది. గట్టిగా ఏడుస్తూ బాత్రూమ్‌కి వెళ్లి గుక్కపెట్టి ఏడ్చింది. ఆమె వెనుక బాత్రూంకి వెళ్లి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ మళ్ళీ బుజ్జగింపులు మొదలుపెట్టాడు వరుణ్. ఇకపొతే టాస్క్ రద్దు కారణంగా జైలులో ఉన్న రాహుల్, వరుణ్‌ల మధ్య డిస్కషన్ జరగ్గా, పునర్నవి హర్ట్ అయ్యేట్టుగా మాట్లాడాడు రాహుల్. ఆమె కన్నీళ్లు పెట్టుకునేలా చేశాడు. దీనిపై సీరియస్ డిస్కషన్ జరుగుతుండుగా, వారిద్దరి జైలు శిక్ష ముగిసినట్టు ప్రకటించారు బిగ్ బాస్.
కెప్టెన్ అయ్యేందుకు ఈ టాస్క్‌లో అనర్హులుగా ఉన్న వాళ్లు అర్హులైన వాళ్ళు కెప్టెన్ అయ్యేందుకు సహకరిస్తారని ఎవరి కోసం ఎవరు ఆడతారో మీరే తేల్చుకోవాలని బిగ్ బాస్ తెలిపాడు. బాబా భాస్కర్ కోసం శిల్పా చక్రవర్తి, హిమజ కోసం రాహుల్, శ్రీముఖి కోసం రవి ఆడటానికి ముందుకు వచ్చారు. 'ఆపిన వాడిదే అధికారం' అంటూ సాగిన ఈ టాస్క్‌లో శిల్పా చక్రవర్తి సాయంతో హౌస్ మిస్టర్ పర్ఫెక్ట్ బాబా బాబా భాస్కర్ కెప్టెన్ అయ్యారు.