శ్రీముఖికి శిక్ష విధించిన బిగ్‌బాస్.. హిమజను కనికరించని అలీ
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (11:30 IST)
తెలుగులో రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ మూడో సీజన్ రియాల్టీ షోలో భాగంగా, బిగ్ బాస్ హౌస్ మరింతగా హీటెక్కింది. టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్ రవికృష్ణ చేతికి రక్తపు గాయమైంది. ఇది మరో కంటెస్టెంట్ శ్రీముఖి కారణంగానే అయిందని సహా కంటెస్టెంట్స్ ఆరోపించారు. దీంతో బిగ్ బాస్ సీరియస్ అయి శ్రీముఖికి శిక్ష విధించాడు. మరోవైపు హిమజ - అలీకి మధ్య జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానలా తయారైంది. అలీని ముఖంపై కాలితో తన్నడంతో అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరకు హిమజ అతని కాళ్లు పట్టుకుని వేడుకున్నప్పటికీ అలీ కనికరించలేదు. ఇలాంటి సంఘటనల కారణంగా బిగ్ బాస్ హౌస్ హీటెక్కింది.
ఇకపోతే, కెప్టెన్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా, దొంగలుగా ఉన్న శ్రీముఖి, అషూ, రవిలు నిధిని దొంగిలించేందుకు అనేక పథకాలు వేశారు. రవి, అషూలు కొద్ది సేపు జైలులో ఉండడంతో శ్రీముఖి మొత్తం బాధ్యతని తీసుకొంది. వరుణ్‌ని మాటలలో పెట్టి ట్రంక్ పెట్టె దగ్గరకి తీసుకొచ్చి ఆయన జేబులో ఉన్న డబ్బుని బాక్స్‌లో వేసింది. దీంతో ఆమె సంబరాలు అంబరాన్నంటాయి.
ఇక పోలీసులకి కొద్ది పాటి లంచం ఇచ్చి అషూ బయటకి వచ్చింది. ఇద్దరు కలిసి నిధిని దొంగిలించేందుకు పలు పథకాలు వేశారు. పర్సనల్ ఎటాక్ చేస్తే నిధి దక్కుతుందని మహేష్ సలహా ఇవ్వడంతో రవిని బయటకి తీసుకొచ్చి శ్రీముఖి, అషూలు నిధి అద్దాలని పగలగొట్టాలని డిసైడ్ అయ్యారు. పక్కా ప్లాన్ ప్రకారం డంబెల్‌తో నిది దగ్గరకి వెళ్లిన శ్రీ ముఖి.. నిధి చుట్టు వరుణ్, వితికా, తమన్నా, మహేష్‌లు కాపలా ఉన్నా ధైర్యం చేసి డంబెల్‌తో నిధి అద్దాలను పగలగొట్టింది.
రవిని సైతం పగలగొట్టమమని శ్రీముఖి సలహా ఇవ్వడంతో అతను చేతితో అద్దాలను పగలగొట్టాడు. దీంతో అతని చేతికి బలమైన గాయం కావడంతో పాటు రక్తం ధారళంగా పారింది. వెంటనే అతనిని మెడికల్ రూంలోకి తీసుకెళ్లి చికిత్స అందించారు వైద్యులు. శ్రీముఖి తప్పుడు ఆలోచనతోనే రవికి గాయమైందని వితికా, రాహుల్‌లు ఆమెపై ఫైర్ అయ్యారు.
రోహిణి ... శ్రీముఖికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నప్పటికి తప్పంతా శ్రీముఖిదే అని వారు గట్టిగా వాదించారు. నిధికి సంబంధించిన విలువైన వస్తువులన్ని వరుణ్ సోఫాలో పడేశాడు. అవన్ని రవి కృష్ణకే ఇవ్వాలని కొందరు అన్నారు. మరి ఇంతలోనే ఎపిసోడ్ 18కి ఎండ్ కార్డ్ పడడంతో కెప్టెన్ ఎవరు అవుతారు అనే దానిపై ఇంకా సస్పెన్స్ నెలకొని ఉంది. నేటి ఎపిసోడ్‌లో రవి కృష్ణ గాయంపై ఇంకా ఎలాంటి డిస్కషన్స్ జరుగుతాయో, కెప్టెన్‌గా ఎవరు ఎంపిక అవుతారో చూడాలి.
అంతకుముందు అలీ - హిమజల మధ్య పెద్ద గొడవే జరిగింది. అలీని మొహం మీద కాలితో తన్నింది. అలా తన్నడం కరెక్టా అని అలీతో పాటు పలువురు ఇంటి సభ్యులు ఆమెని నిలదీశారు. దీంతో హిమజ.. అలీకి సారి చెప్పింది. అయినప్పటికి ఆయన శాంతించకపోవడంతో అలీ కాళ్ళపై పడి క్షమాపణలు కోరింది హిమజ. నువ్ కాళ్లపై పడి సింపథీ చూపించడం కాదు.. నేను నిన్ను కాళ్లపై పడమన్నానా? జస్ట్ సారీ కోరాను అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడటంతో హిమజ.. బాత్రూమ్‌కి వెళ్లి మరీ బోరున ఏడ్చింది. ఇలాంటి సంఘటనలతో బిగ్ బాస్ హౌస్ బాగా హీటెక్కింది.