పొట్టి డ్రెస్‌లు.. లిప్ స్టిక్‌లు.. రెచ్చిపోయిన బిగ్ బాస్ హౌజ్ మేట్స్..
గురువారం, 25 జులై 2019 (12:07 IST)
బిగ్ బాస్ హౌజ్‌లో టాస్క్‌ల సందడి మొదలైంది. టాస్క్‌లు పూర్తి చేసేందుకు హౌజ్ మేట్స్ నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నారు. రెండో రోజు హేమ, శ్రీముఖి, హిమజ మధ్య చిన్నపాటి వార్ జరిగింది. అలాగే మూడో రోజు హేమ, రాహుల్ సిప్లిగంజ్ మధ్య వార్ జరిగింది.
మూడో రోజు బిగ్ బాస్.. ఇంటి సభ్యులని బాల్యంలోకి తీసుకెళ్ళాడు. అందరు చిన్న పిల్లల్లా మారాలని వారికి కేర్ టేకర్‌గా వరుణ్ సందేశ్, పునర్నవి ఉంటారని చెప్పారు. టాస్క్ మొదలు కాగానే ఇంటి సభ్యులు అందరు చిన్న పిల్లల్లా డ్రెస్ ధరించి ముఖానికి లిప్‌స్టిక్‌లు పూసుకొని రెచ్చిపోయారు. ఒకానొక దశలో వీరి రచ్చ ప్రేక్షకులకి కాస్త అసహనం కూడా కలిగించింది. అయితే ఇంటి సభ్యులలో ఒకడైన మహేష్ విట్టా తనకి ఓవరాక్షన్ చేయడం రాదని, చిన్నప్పుడు సైలెంట్‌గానే ఉన్నానని చెప్పి మంచి ఎక్కి పడుకున్నాడు.
ఆ పక్కనే ఉన్న రవికృష్ణ, రోహిణిలు మహేష్‌ని ఉద్దేశించి కర్రోడు, ఓ పొడుస్తా అన్నాడు. ఇప్పుడేమో మంచం ఎక్కి కూర్చున్నాడంటూ కుళ్ళు జోకులు వేసుకున్నారు. ఇది విన్న మహేష్ వారిపై సీరియస్ అయ్యాడు. చదువుకున్నవాడిలా మాట్లాడు.. మహేష్ గాజు అను పర్లేదు.. కర్రోడు అని కించపరిచేలా మాట్లాడితే బాగోదని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రవికృష్ణ, రోహిణి మహేష్ విట్టాకు సారీ చెప్పాడు.
కొద్ది సేపటి తర్వాత శ్రీముఖి ఫుడ్ విషయంపై రాహుల్‌తో పాటు పలువురు ఇంటి సభ్యులతో కలిసి చర్చ జరుపుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన హేమ నువ్వు వారిని ఫుడ్ గురించి ఎందుకు అడిగావు అంటూ శ్రీముఖిని ప్రశ్నించింది. దీంతో పక్కన ఉన్న రాహుల్ సిప్లిగంజ్, అలీరాజా ఫైర్ అయ్యారు. అంటే మేము అడగకూడదా, పిచ్చోళ్ళలెక్క కనిపిస్తున్నామా అంటూ రాహుల్.. హేమపై ఫైర్ అయ్యాడు.
కొద్ది సేపు ప్రశాంతంగా ఉన్న హేమ.. రాహుల్‌పై రివర్స్ ఫైర్ అయింది. ఇక అక్కడ వాతావరణం హీటెక్కుతుందని భావించిన మిగతా ఇంటి సభ్యులు గార్డెన్ ఏరియాకు తీసుకెళ్లి సర్ధి చెప్పడంతో వివాదం కాస్త సద్దుమణిగింది.
ఇక నేటి ఎపిసోడ్‌కి సంబంధించి ప్రోమో విడుదల కాగా, ఇందులో చపాతి ముక్క కోసం హౌజ్‌మేట్స్ మధ్య వార్ నడిచింది. చిన్న చపాతి ముక్క కోసం రచ్చనా? చాలా సిల్లీగా ఉందంటోంది పునర్నవి భూపాలం చెప్పుకొచ్చింది. స్నేహపూర్వక వాతావరణంలో మొదలైన బిగ్ బాస్ ఇంటి ప్రయాణంలో మొదలైన కలతలు పీక్ స్టేజ్‌కి చేరుతున్నాయి.