చిచ్చు పెట్టిన బిగ్ బాస్.. విలన్‌గా మారిన హిమజ.. చివరికి ఏమైందంటే?

శనివారం, 24 ఆగస్టు 2019 (13:24 IST)
బిగ్ బాస్ మూడో సీజన్ ఐదో వారాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరి టర్న్ అనేది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో హౌస్ మేట్స్ మధ్య బిగ్ బాస్ గొడవ పెట్టేశారు. హౌస్‌లో గ్రూప్‌గా ఉన్న పునర్నవి, రాహుల్, వితికా, వరుణ్‌ల మధ్య బిగ్ బాస్ కారణంగా గొడవ వచ్చింది.  
 
పునర్నవి కోసం.. వితికా, వరుణ్, రాహుల్ గుసగుసలాడిన వీడియోలను కన్ఫెషన్ రూంలో పునర్నవికి సీక్రెట్‌గా ప్లే చేసి చూపించారు బిగ్ బాస్. వీడియోలు చూసిన పునర్నవి తెగ ఫీల్ అయిపోయింది. ఈ విషయంలో వితికాతో గొడవ పడిన పునర్నవి.. రాహుల్ వద్ద తన బాధను చెప్పుకొని బాధపడింది.
 
అనంతరం శ్రీముఖిని సీక్రెట్ రూంలోకి పిలిచిన బిగ్ బాస్.. ఆమెకోసం పునర్నవి, రాహుల్, వితికాలు ఎలా మాట్లాడుకున్నారో వీడియో ప్లే చూసి చూపించారు. ఇలా వీడియోలు చూపించి చిచ్చుపెట్టేశారు బిగ్ బాస్. ఈ వీడియో చూసిన తరువాత శ్రీముఖి ఎమోషనల్ అయింది. ఇక బిగ్ బాస్.. హిమజకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. హౌస్‌లో విలన్‌గా మారమన్నారు.
 
ఇలా చేస్తే ఇమ్యునిటీ లభిస్తుందని చెబుతారు. దీంతో రంగంలోకి దిగిన హిమజ హౌస్‌మేట్స్‌కి చుక్కలు చూపించింది. అయితే హిమజకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌ను సరిగా చేయలేకపోవడం వల్ల ఆమెకు ఇచ్చిన ఇమ్యునిటీని కోల్పోయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు