యువ హీరోలు పక్కనబెట్టేయడంతో సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చినా వదిలిపెట్టకుండా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ఖైదీ నెం.150 ద్వారా తానేంటో నిరూపించుకోవాలనుకుంటోంది. మంచి అవకాశాల కోసం ఎదురుచూసిన ఈ భామకు ఈ మధ్య వరుసగా ఆఫర్లు వస్తున్నా సక్సెస్ మాత్రం రావటం లేదు. దీంతో అభిమానులను అలరించేందుకు ఫోటోషూట్లతో సందడి చేస్తోంది.
ఇందులో భాగంగా బ్లాక్ అండ్ వైట్ థీమ్తో షూట్ చేసిన ఓ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది. ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ టెడ్ గ్రాంట్ చేసిన కామెంట్ను ఫోటోతో పాటు పోస్ట్ చేసింది. 'నువ్వు ఎప్పుడైనా ఓ మనిషిని కలర్లో ఫోటో తీస్తే, అందులో అతని దుస్తులు మాత్రమే కనిపిస్తాయి. అదే నువ్వు ఓ వ్యక్తిని బ్లాక్ అండ్ వైట్లో ఫోటో తీస్తే, అందులో అతని ఆత్మ కనిపిస్తుంది' అనే టెడ్ గ్రాంట్ కామెంట్ను పోస్ట్ చేశారు కాజల్ అగర్వాల్.