బాలీవుడ్ డ్రగ్స్ కలకలం: అర్జున్ రాంపాల్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదా

సోమవారం, 9 నవంబరు 2020 (19:03 IST)
డ్రగ్స్ భూతం బాలీవుడ్‌ను కుదిపేస్తుంది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీ వుడ్లో డ్రగ్స్ కలకలం మొదలైంది. దీంతో రంగంలోకి దిగిన ఎన్సీబీ అధికారులు పలువురిపై కేసు నమోదు చేశారు. విచారణలు జరిపారు.
 
ఈ నేపథ్యంలో మరో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదా మొదలు పెట్టారు. నిన్న బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నడియాడ్‌వాలా భార్యను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వారి ఇంటిపై జరిపిన సోదాలో సుమారు 10 గ్రాముల మరిజువానా బయటపడటంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
 
ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారి సమీర్ మాట్లాడుతూ నడియాడ్‌వాలాకు సమన్లు జారీ చేశామని తెలిపారు. అయితే ఇంతవరకు అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఐతే ఇటీవల ఓ డ్రగ్స్ సరఫరాదారుడిని అరెస్ట్ చేశామని తెలిపారు.
 
మరో వైపు సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి కూడా దాదాపు నెల రోజులు జైలు జీవితం గడిపి బెయిలుపై విడుదలైన సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ తదితరులు కూడా ఎన్సీబీ విచారణను ఎదుర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు