ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, తాను 14 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యానని, నిజానికి అప్పుడు అది ఏంటనేది తనకు అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. అప్పుడు జరిగిన దానిని తాను మాటల్లో చెప్పలేనని పేర్కొన్న ఐరా.. తనకు ఎదురైన అనుభం గురించి తెలుసుకోవడానికి తనకు యేడాది పట్టిందన్నారు.
ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు మెయిల్ ద్వారా తెలియజేశానని, వారితో ఆ బాధను పంచుకున్నానని వివరించింది. ఆ తర్వాత ఎప్పుడూ తాను ఆ విషయం గురించి ఆలోచించలేదని, దానిని గురించి తలచుకుని భయపడకుండా ముందుకు సాగినట్టు పేర్కొంది.
తన తల్లిదండ్రులు ఆమిర్ ఖాన్-రీనా దత్తాలు విడాకులతో విడిపోవడం తనను బాధించలేదని ఐరాఖాన్ తెలిపింది. వారు విడిపోయినా స్నేహితుల్లా కలిసిమెలసి ఉన్నారని, తమది బ్రోకెన్ ఫ్యామిలీ కాదని పేర్కొంది. అయితే, ఆ సమయంలో కొంత మానసిక ఒత్తిడికి గురైన మాట వాస్తవమేనని అంగీకరించింది.
వారి విడాకుల వల్ల తాను కుంగుబాటుకు గురైనట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. వారు విడిపోయినప్పటికీ తమకు మాత్రం మంచి తల్లిదండ్రుల్లానే ఉన్నారని, వారి విడాకులు తనను బాధించలేదని పేర్కొన్న ఐరా.. తన కుంగుబాటుకు మాత్రం అది కారణం కాదని తేల్చి చెప్పింది