బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌ రిపీట్...

గురువారం, 31 జనవరి 2019 (16:59 IST)
ఎన్‌టీఆర్ బయోపిక్‌లో మొదటిసారి బాలకృష్ణ ముఖ్యమంత్రి పాత్రలో నటించారు. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఎన్‌టీఆర్ పాత్రలో నటించినందుకు బాలయ్య చాలా సంతృప్తి వ్యక్తం చేసారు. తాజాగా మరో మారు ముఖ్యమంత్రి పాత్రలో నటించే అవకాశం వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
 
ఇప్పటికే బాలకృష్ణ తన తదుపరి చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉంటుందని ప్రకటించేసారు. 'సింహా', 'లెజెండ్' సినిమాలతో బాలయ్యను పవర్‌ఫుల్ పాత్రల్లో చూపించిన బోయపాటి ఇప్పుడు తీయబోయే సినిమాలో పవర్‌ఫుల్ ముఖ్యమంత్రిగా చూపనున్నట్లు సమాచారం.
 
డ్యూయల్ రోల్‌లో నటించే ఈ సినిమాలో ఒక పాత్రలో ముఖ్యమంత్రిగా కనిపిస్తారని, దీని కోసం పాత్ర స్వభావం, హావభావాలు ఎలా ఉండాలి అనే విషయాలను ఇప్పటికే బాలయ్యకు చెప్పినట్లు సమాచారం.
 
ప్రస్తుతం 'ఎన్‌టీఆర్ మహానాయకుడు' సినిమాలో నటిస్తున్న బాలయ్య అది పూర్తవగానే ఫిబ్రవరి 21 లేదా 22 నుండి ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది. కొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తుండడం, ఈ సమయంలో ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తుండటంతో అటు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాల్లో కూడా దీని గురించి చర్చలు ప్రారంభమయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు