టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ట్విట్టర్ ద్వారా ఓ షాకింగ్ న్యూస్ వెల్లడించారు. అదీ ఆయన కుటుంబానికి చెందిన వార్త కావడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే...‘నా కుమారుడు సంజయ్, అతని భార్య ఇంద్రాక్షి గత 5 నెలలుగా విడిపోయి ఉన్నారు. త్వరలోనే విడాకులు తీసుకోనున్నారు. ఈ జంట విడిపోయాక మరో కొత్త జీవితం ప్రారంభించాలని, వారి భవిష్యత్ ఆనందంగా సాగిపోవాలని ఆశీర్వదించండి' అంటూ ట్వీట్ చేశాడు.
ఇది టాలీవుడ్, అతని అభిమానుల్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారిపోయింది. కాగా, తన కుమారుడు సంజయ్ హీరోగా బ్రహ్మాజీ ఒక సినిమా తీస్తున్నట్టు తెలుస్తోంది. కుటుంబ విషయాలను సోషల్ మీడియా ద్వారా చెప్పేందుకు తారలు వెనుకడుగు వేస్తారు. అయితే బ్రహ్మాజీ మాత్రం తన కుమారుడి వైవాహిక జీవితాన్ని తెగతెంపులు చేసుకోనున్నాడని.. వారి జీవితం అంతటితో ఆగిపోకుండా.. భవిష్యత్తు మెరుగ్గా ఉండాలని ఆశీర్వదించాలని కోరడం చర్చనీయాంశమైంది.