బోల్డ్ సీన్స్ అనేది కథ ప్రకారమే ఉంది : బబుల్‌గమ్ నాయిక మానస చౌదరి

మంగళవారం, 26 డిశెంబరు 2023 (16:41 IST)
Manasa Chaudhary
రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బబుల్‌గమ్'. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ మానస చౌదరి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
బబుల్‌గమ్ తో జర్నీ ఎలా మొదలైయింది ? మీ నేపధ్యం గురించి చెప్పండి ?
నేను చిత్తూరు జిల్లా పుత్తూరులో పుట్టాను. చెన్నైలో పెరిగాను. నాన్న బిజినెస్ చేస్తారు. నాకు ఎలాంటి సినిమా నేపధ్యం లేదు. పరిశ్రమలోకి వెళ్తానని చెప్పినపుడు ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది. చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ స్టార్ట్ చేశాను. ఒక స్నేహితుడి ద్వారా దర్శకుడు రవికాంత్ గారికి నా ప్రొఫైల్ సెండ్ చేశాను. ఆయనకి నచ్చి టీం నుంచి నాకు కాల్ వచ్చింది. తర్వాత ఫోటో షూట్ చేశాం. అలా జర్నీ మొదలైయింది.
 
ఇది మీ మొదటి సినిమా కదా.. ఈ అనుభవం గురించి చెప్పండి ?
రవికాంత్ అండ్ టీం చాలా సరదాగా వుంటారు. బబుల్‌గమ్ కథ లవ్, రెస్పెక్ట్ గురించి వుంటుంది. సినిమా యూనిట్ కూడా నాపై ఎంతో ఆప్యాయత, గౌరవాన్ని చూపించింది. సెట్ లో చాలా కంఫర్ట్బుల్ గా చూసుకున్నారు. మోడలింగ్ వలన నాకు కెమరా ఫియర్ లేదు. సినిమా విషయానికి వస్తే దర్శకుడి విజన్ కి న్యాయం చేస్తున్నానా లేదా అనే దానిపైనే ద్రుష్టి పెట్టాను.  
 
బబుల్‌గమ్ కథ విన్నప్పుడు ఎలా అనిపించింది ?
రవికాంత్ ఈ కథ చెప్పినపుడు చాలా నచ్చింది. 22 ఏళ్ల ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా ఉంటారో అలానే అనిపించింది. చాలా రియలిస్టిక్ గా వుండే కథ. ఇందులో వుండే సన్నివేశాలని బోల్డ్ అనడం కంటే చాలా బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేశారని చెప్పాలి.    
 
ఇందులో బోల్డ్ గా కొన్ని సీన్స్ చేశారు ఎలా అనిపించింది ?
బోల్డ్ అనేది కథ ప్రకారమే ఉంది. ఎక్కడా లిమిట్స్ దాటలేదు. ప్రేమను చెప్పే సంధర్భంగా కిస్ సెన్స్ ఉన్నాయి. 
 
భవిష్యత్ చాలా బావుంటుందని అనిపించింది. మరో ఆలోచన లేకుండా సినిమా చేశాను.
 
మీరు మోడల్ కదా.. ఈ పాత్ర కోసం మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ఏమిటి ?
ఇందులో జాన్వి పాత్రలో కనిపిస్తా. తను ఫ్యాషన్ డిజైనర్. దర్శకుడు ఈ పాత్రకు సహజంగా కనిపించే నటులనే ఎంపిక చేసుకున్నారు. ఇందులో రియల్ లైఫ్ కి దగ్గరగా వున్న పాత్రలనే తీసుకున్నారు. ఫోటో షూట్ జరిగినప్పుడు నా లైఫ్ కి సంబధించిన కొన్ని విషయాలని అడిగి తెలుసుకున్నారు. పాత్రని సహజంగా తీర్చిదిద్దడానికి వాటిని కూడా మౌల్డ్ చేశారనిపించింది.  గతంలో ఏమోజి అనే  వెబ్ సిరిస్ చేశాను. అయితే అప్పటికి నటన నాకు చాలా కొత్త. బబుల్‌గమ్ విషయానికి వస్తే చాలా మెరుగయ్యాను. పాత్ర స్వరూపాన్ని అర్ధం చేసుకొని చేశాను. జాన్వీ పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది. అలాగే రోషన్ నుంచి కూడా చాలా నేర్చుకున్నాను.
 
సుమ గారిని నుంచి ఎలా ఫీడ్ బ్యాక్ వచ్చింది ?
సుమ గారు సినిమా చూశారు. చాలా బాగా చేశాని చెప్పారు. ట్రైలర్ టీజర్ చూసిన ఆడియన్స్ కూడా చాలా అందంగా, సహజంగా కనిపిస్తున్నాను ప్రశంసించారు.
 
రవికాంత్ గారి గత చిత్రాలు చూశారా ?
రవికాంత్ గారి క్షణం సినిమా నా ఫేవరేట్. ఆయన్ని కలసి వెంటనే ఈ సంగతి చెప్పాను.
 
ఇందులో మీకు సవాల్ గా అనిపించిన అంశం ఏమిటి ?
ఇందులో కొన్ని ఇంటెన్స్ ఎమోషన్ వున్న సన్నివేశాలు వున్నాయి. ఆ ఇంటెన్స్ ని కొనసాగించడం కొంత సవాల్ గా అనిపించింది. జాన్వి పాత్రలో అన్ని ఎమోషన్స్ వున్నాయి. నటించడానికి ఆస్కారం వుండే పాత్ర దక్కడం చాలా ఆనందంగా వుంది. బబుల్‌గమ్ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది.
 
రోషన్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
మా ఇద్దరికి ఇది తొలి చిత్రం. రోషన్ కి నటనపై మంచి పట్టు వుంది. ఈ సినిమాతో తను నేర్చుకోవడంతో పాటు నాకు కూడా చాలా విషయాలు నేర్పించాడు. దాదాపు ఏడాది పాటు ఈ జర్నీ గడిచింది. చాలా మెమరబుల్ జర్నీ ఇది.
 
ప్రొడక్షన్ హౌస్ గురించి ?
నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
 
శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ గురించి ?
శ్రీచరణ్ వండర్ ఫుల్ కంపోజర్. బబుల్‌గమ్ కు మెమరబుల్ ఆల్బమ్ ఇచ్చారు. పాటల్ని ప్రేక్షకులు  చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
 
ప్రమోషన్స్ కోసం కాలేజీలకు వెళ్ళారు కదా.. రెస్పాన్స్ ఎలా వుంది ?
చాలా అభిమానాన్ని ప్రేమని చూపించారు. వారికి ట్రైలర్ టీజర్ చాలా నచ్చింది.
 
భవిష్యత్ లో ఎలాంటి పాత్రలు చేయాలని వుంది ?
ఇప్పుడే పరిశ్రమలోకి వచ్చాను. ఇది కావాలి ..అది వద్దు అనేది ఏమీ లేదు. మంచి కథలు చేయాలని వుంది. నాకు అన్ని జోనర్స్ ఇష్టం. అన్ని జోనర్స్ చేయాలని వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు