బిగ్ బాస్-5లో కూడా మగవారే విన్నరా..?

సోమవారం, 13 సెప్టెంబరు 2021 (22:05 IST)
'బిగ్ బాస్ 5' ప్రారంభమైంది. బిగ్ బాస్ తొలి నాలుగు సీజన్లలో మగవారే గెలిచారు. సీజన్ వన్‌లో శివబాలాజీ, సీజన్ 2లో కుశాల్ మండ, సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్, సీజన్ 4లో అభిజిత్ విన్నర్స్ గా నిలిచారు. ఫస్ట్ సీజన్‌లో హరితేజ, సెకండ్ సీజన్‌లో గీతామాధురి, థర్డ్ సీజన్‌లో శ్రీముఖి, ఫోర్త్ సీజన్‌లో అరియానా, హారిక వంటి మహిళలు విన్నర్స్‌కి గట్టి పోటీ ఇచ్చారు.
 
అయితే సీజన్ 5కి వస్తే మొత్తం 19 మంది పోటీ దారుల్లో అనీ, హమీద, కాజల్, లహరి, ప్రియాంక, ప్రియ, సిరి, శ్వేత, ఉమాదేవి, సరయు మహిళలు. వీరిలో సరయు తొలి వారమే ఎలిమినేట్ అయింది. మిగిలిన వారిలో గట్టి పోటీ ఇచ్చి పైనల్ వరకూ దూసుకు వెళ్ళే మహిళలు ఎవరు అనే దానిపై డిష్కషన్స్ జరుగుతున్నాయి.
 
అదే మేల్ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే యాంకర్ రవి, సింగర్ శ్రీరామచంద్ర, యు ట్యూబర్ షన్ముఖ్ సోషల్ మీడియాలో హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్నవారు. ఇక విజె కమ్ ఆర్టిస్ట్ సన్ని, మోడల్ జస్వంత్, ఆర్టిస్ట్ మానస్ ని తేలికగా అంచనా వేయటానికి లేదు. సో ఈ సారి హౌస్ లో ఫిమేల్ కంటెస్టెంట్స్ కంటే మేల్ కంటెస్టెంట్స్ పవర్ ఫుల్ అని తేల్చేస్తున్నారు. 
 
ఈ లెక్కన ఈసారి బిగ్ బాస్ 5 విన్నర్‌గా నిలిచేది మగవాడే అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న దాని ప్రకారం యాంకర్ రవి, శ్రీరామచంద్ర మధ్య టైటిల్ పోరు ఉంటుందంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు