ఐశ్వర్యరాయ్‌ బ్లూ లిప్ స్టిక్... పొట్టొచ్చింది.. మళ్లీ గర్భం ధరించిందా?

మంగళవారం, 17 మే 2016 (10:30 IST)
కేన్స్‌ ఫెస్టివల్‌లో ఐశ్వర్యారాయ్‌ పాల్గొనడం.. ఆమె పెదాలకు వేసుకున్న బ్లూకలర్‌ లిఫ్‌స్టిక్‌.. కొందరికి నచ్చకపోవడంతో కామెంట్లు బాగానే వచ్చాయి. అయితే బ్లూ కలర్ లిప్ స్టిక్ సంగతిని పక్కనబెడితే.. ప్రస్తుతం ఐశ్వర్యారాయ్ గర్భవతిగా ఉన్నట్లు వార్తలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఆమె కేన్స్‌లో పాల్గొన్న ఫొటోల్లో.. పొట్ట వచ్చినట్లువుందనీ.. దాన్ని కవర్‌ చేసిందని అంటున్నారు. 
 
ఫిలిం ఫెస్టివల్‌‌లో ఆమెను చూసినవారంతా ఆమె గర్భంతో ఉందని అంటున్నారు. దీనిపై ట్విట్టర్‌‌లో ఇప్పటికే పలువురు ప్రముఖులు పేజ్‌ 3 పీపుల్‌ ట్వీట్లు చేశారు కూడా. గతానికి ఇప్పటికి ఐశ్వర్య ఫోటోల్లోని తేడాలు చూపిస్తూ ఆమె ప్రెగ్నెంట్‌ తేల్చేశారు కొందరు పేజ్‌ 3 ప్రముఖులు - అభిమానులు. చూద్దాం.

త్వరలో మరో న్యూస్‌ చెబుతుందేమో.. ఆరాధ్యకు జన్మనిచ్చిన తరువాత కూడా సినీ కెరీర్‌ కొనసాగిస్తుండడంతో సంతోషంగానే ఉన్న అభిమానులు ఇప్పుడు ఐష్‌ ఇప్పడు రెండో సారి తల్లయితే మళ్లీ సినిమాల్లో నటిస్తుందో లేదో  అని ఆందోళన చెందుతున్నారట.

వెబ్దునియా పై చదవండి