అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత ముక్కు అవినాష్ కార్యక్రమానికి రాకుండా డుమ్మా కొట్టాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో.. వేణుగోపాల్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో అవినాష్‌పై చీటింగ్ కేసు పెట్టాడు. తన వద్ద అడ్వాన్స్ తీసుకుని కార్యక్రమానికి రాకుండా అవినాష్ చీటింగ్‌కు పాల్పడ్డాడు అంటూ వేణుగోపాల్ రెడ్డి చెప్తున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అవినాష్ వద్ద విచారణ చేపట్టనున్నారు.