పూర్తి వివరాలు ఇలా వున్నాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఓ మినీ వ్యానులో బయలుదేరారు. ఐతే వారి వాహనం ప్రకాశం జిల్లా చాకిచర్ల వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళకరంగా వున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.