రణవీర్ సింగ్, వాణికపూర్ జంటగా ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న బేఫికర్ సినిమా సునాయాసంగా సెన్సార్ కత్తెర నుండి తప్పించుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన హాట్ ట్రైలర్లు, ఫోటోలు సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఈ చిత్రంలో దాదాపు వెర్రిక్కించే 40 ముద్దు సీన్లు ఉన్నాయని, సెన్సార్ బోర్డ్ ఆక్షేపిస్తుందని చాలా మంది అనుకున్నారు.
నిర్మాతకు తిప్పలు తప్పవని కూడా అందరూ భావించారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ, ఒక్క సీనుకు కూడా అడ్డు చెప్పకుండా సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చేసింది. రొమాంటిక్ సీన్లను కళాత్మకంగా ఆవిష్కరించే ఆదిత్యాచోప్రా ఈ చిత్రంలో కూడా తన ప్రతిభను చూపారని, ప్రేక్షకులకు నయనానందమేనని సినీ విశ్లేషకులు అంటున్నారు.