ఈ ప్రత్యేక సందర్భంలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించడమే కాకుండా, మేకర్స్ చంద్రిక రవి పాత్రను సిల్క్ స్మితగా పరిచయం చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అచ్చు సిల్క్ స్మితలానే కనిపించారు చంద్రిక రవి. చీర ధరించి, నుదిటిపై బిందీ, సొగసైన కళ్ళుతో గోళ్లు కొరుకుతూ ప్రజెంట్ చేసిన లుక్ లో సిల్క్ స్మితలా ప్రేక్షకులని మురిపించారు చంద్రిక రవి.
సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ చిత్రాన్ని 2024లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.