చిల్‌ గాయ్స్‌.. కాస్తా బ్రేక్‌ తీసుకుంటున్నా.. ఛార్మీ

సోమవారం, 5 సెప్టెంబరు 2022 (10:18 IST)
విజయ్‌ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం 'లైగర్‌'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. ఇక లైగర్‌ ఫలితం అనంతరం చార్మీ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఆమె ట్వీట్‌ చేస్తూ ట్రోలర్స్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చింది. 
 
తాను సోషల్‌ మీడియాకు బ్రేక్‌ ఇస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేస్తూ.. 'చిల్‌ గాయ్స్‌. కాస్తా బ్రేక్‌ తీసుకుంటున్నా(సోషల్‌ మీడియాకు). పూరీ కనెక్ట్స్‌ త్వరలోనే మరింత దృఢంగా, మునుపటికి కంటే ఉత్తమంగా తిరిగి వస్తుంది. అప్పటి వరకు కాస్తా శాంతించండి అబ్బాయిలు' అంటూ ఛార్మీ రాసుకొచ్చింది.  
 
ప్రమోషన్స్‌లో విజయ్‌ ఓవరాక్షన్‌, నోటి దురుసు వల్లే ఈసినిమా ఫ్లాప్‌ అయ్యిందని, అతడిని నమ్ముకున్నందుకు పూరీ కనెక్ట్స్‌ పని అయిపోయిందంటూ సోషల్‌ మీడియా విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న నెగిటివిటి కారణంగానే ఆమె సోషల్‌ మీడియాకు బ్రేక్‌ తీసుకుంటుందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు