లింగా నష్టాన్ని పూడ్చుతానంటూ తనకు ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వలేదంటూ లింగా డిస్ట్రిబ్యూటర్ వేసిన పిటీషన్ ను చెన్నై హైకోర్టు తోసిపుచ్చింది. లింగా సినిమాతో కబాలికి లింకు లేదనీ, ఆ చిత్రంతో ఈ చిత్రం విడుదలకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. కాబట్టి కబాలి చిత్రాన్ని విడుదల చేయరాదంటూ పిటీషనర్ వేసిన పిటీషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. దీనితో కబాలి విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి.