తల్లిదండ్రులే నాకు అతిపెద్ద బలం.. చెర్రీ

శనివారం, 20 ఫిబ్రవరి 2021 (13:45 IST)
chiranjeevi
మెగాస్టార్ చిరంజీవికి వివాహ వార్షికోత్సవం. ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  అలా తల్లిదండ్రులకు సినీ నటుడు రామ్ చరణ్ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. తన తల్లిదండ్రులే తనకు అతిపెద్ద బలం అని ఈ సందర్బంగా చరణ్ ట్వీట్ చేశాడు.

మీ ఇద్దరికీ 42వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని తెలిపాడు. 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది. మరోవైపు ఇతర సినీ ప్రముఖులు కూడా చిరంజీవి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
 
ఇక సినిమాలతో పాటు కుంటుంబానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వారిలో చిరు ముందు వరసులో ఉంటారు. ముఖ్యంగా భార్య సురేఖపై తనకున్న ప్రేమను అడపాదడపా ఇంటర్వ్యూలో బయటపెడుతూనే ఉంటాడు చిరు. ఈ జంట 1980 ఫిబ్రవరి 20న వివాహబంధంతో ఒక్కటయ్యారు. దీంతో మెగాస్టార్‌ వివాహం జరిగి నేటితో 41 ఏళ్లు పూర్తయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు