'మహేష్, చిరు' వరదసాయం.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50లక్షలు

బుధవారం, 1 డిశెంబరు 2021 (18:58 IST)
ఏపీలో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదలతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. వరదల కారణంగా భారీగా పంట, ఆస్తి నష్టం జరిగింది. అకాల వ‌ర్షాల‌తో రాయ‌ల‌సీమ‌లోని క‌డ‌ప‌, చిత్తూరు, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల‌తో పాటు నెల్లూరు జిల్లాలోనూ వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. 
 
దాదాపు ఆరువేల కోట్లకు పైగానే వ‌ర‌ద న‌ష్టం సంభ‌వించింద‌ని ప్రభుత్వం అంచ‌నా వేసింది. ఈ నేపథ్యంలో త‌క్ష‌ణ సాయంగా కేంద్ర ప్ర‌భుత్వం కొంత సాయాన్ని అందించాలని వై.ఎస్‌.జ‌గ‌న్ సర్కారు విజ్ఞప్తి చేసింది. 
 
ఇలాంటి తరుణంలో టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మ‌హేశ్ బాబు వ‌ర‌ద బాధితుల కోసం త‌లా రూ.25 ల‌క్ష‌లు విరాళాన్ని అందిస్తున్న‌ట్లు ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌ర‌ద‌ల విప‌త్తు బాధిత కుటుంబాల‌కు నావంతు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 25 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టిస్తున్నాను.. అని చిరంజీవి తెలిపారు. 
Megastar Chiranjeevi
 
ఆంధ్రప్రదేశ్ వినాశకరమైన వరదలు సంభవించాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ప‌డుతున్నారు. వారి కోసం నా వంతుగా రూ.25 ల‌క్ష‌లు ఆర్థిక సాయం అందిస్తున్నాను. ఇది సంక్షోభ స‌మ‌యం ఒక‌రికొకరు అండ‌గా నిల‌బ‌డాల్సిన త‌రుణం. అంద‌రూ ముందుకు వ‌చ్చి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సాయం చేయండి అని అని మ‌హేశ్ పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు