కర్నాటక రాష్ట్రంలో ఓ ప్రభుత్వ మాజీ ఉద్యోగి బండారం బయటపడింది. నెలకు రూ.15 వేలు వేతనం తీసుకునే ఆ ఉద్యోగి ఆస్తులు మాత్రం రూ.30 కోట్లుగా ఉన్నాయి. ఈ విషయం లోకాయుక్త అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో వెలుగు చూశాయి. ఇంతకీ ఆ ఉద్యోగి చేసేది గుమస్తా ఉద్యోగం. అతనిపై అవినీతి ఆరోపణలు రావడంతో లోకాయుక్త అధికారులు సోదాలు జరిపిపారు. అప్పట్లో ఆయన జీతం నెలకు రూ.15వేలు కాగా.. ఆస్తులు మాత్రం రూ.30 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నకిలీ పత్రాలు, నకిలీ బిల్లులు సృష్టించడంతో పాటు దాదాపు రూ.72 కోట్లకు పైగా దుర్వినియోగం చేశారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై లోకాయుక్తకు ఫిర్యాదు అందడంతో కోర్టు ఆదేశాలమేరకు నిడగుండి ఇంట్లో అధికారులు సోదాలు చేశారు.