కాగా, ఏపీ ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు కారణంగా గతంలో మాదిరిగా ఇష్టంవచ్చినపుడుల్లా టిక్కెట్ల ధరలను పెంచుకోవడం ఇక కుదరదు. ఈ బిల్లుపై చిరంజీవి స్పందించారు. పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం రాష్ట్రంలో ఆన్‌లైన్ టిక్కెట్ విధానానికి వీలు కల్పంచే బిల్లు ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు.
అయితే, థియేటర్ల మనుగడతో పాటు.. చిత్రపరిశ్రమను నమ్ముకుని వున్న వేలాది కుటుంబాల బతుకు దెరువు కోసం తగ్గించిన టిక్కెట్ ధరలను కాలానుగుణంగా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా ధరలను సముచిత రీతిలో నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని ఆయన కోరారు.