బీసీ జన గణన చేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం, దీనికి వీలుగా కేంద్రాన్ని కోరుతూ, అసెంబ్లీలో తీర్మానం చేయడం ఆ వర్గాల్లో ఉత్సాహానికి కారణం అయింది. బీసీ సంఘాల వారు, బీసీ నేతలు ఏపీ సీఎం జగన్ ని అభినందించేందుకు క్యూకడుతున్నారు.
సీఎంను కలిసిన వారిలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆంజనేయులు, బీసీ సంక్షేమ సంఘం కోశాధికారి కన్నా మాష్టారు, రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి హనుమంతరావు, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె క్రాంతి కుమార్, అనంతపురం, గుంటూరు జిల్లాల బీసీ సంఘం అధ్యక్షులు రమేష్, రంగనాధ్‌లు ఉన్నారు.
బీసీ సంఘాల ప్రతినిధులతో పాటు సీఎంను కలిసినవారిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ , ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, ఆర్ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే జోగి రమేష్, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహన్‌రావు ఉన్నారు.