'దాదా ఫాల్కే' ఎపుడో రావాల్సింది.. విశ్వనాథ్‌‌తో 'మాధవ' పాత జ్ఞాపకాలు నెమరు (Video)

మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (15:48 IST)
కళాతపస్వీ, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్న దర్శకుడు కె.విశ్వనాథ్‌ను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... తన అభిమాన దర్శకుల్లో ఒకరైన విశ్వనాథ్ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకోవడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. 
 
నిజానికి ఆయనకు ఈ అవార్డు ఎపుడో రావాల్సిందన్నారు. కానీ, రాకపోవడానికి కారణాలు ఏమైనా... ఇపుడు వరించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఒక దర్శకుడిగానే కాకుండా తన గురువుగా భావించే విశ్వనాథ్... నిండు నూరేళ్లూ ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన దర్శకత్వంలో తాను నటించిన చిత్రాలకు సంబంధించిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి