మా మామ ఎప్పటికీ నిత్యయవ్వనుడే : ఉపాసన

ఆదివారం, 4 ఆగస్టు 2019 (16:53 IST)
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం కోసం ఆయన గెడ్డం పెంచివున్నారు. ఆ గెటప్‌లోనే ఆయన ఇంతకాలం కనిపిస్తూ వచ్చారు. అయితే, చిరంజీవి స్టైల్‌ను ఆయన కోడలు ఉపాసన పూర్తిగా మార్చేసి, కుర్రపిల్లోడిలా చేసింది. ఈ గెటప్‌లో మెగాస్టార్‌ను చూసిన ప్రతి ఒక్కరూ.. ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ లుక్ స్టైల్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 
అపోలో గ్రూపు సంస్థల కోసం బి-పాజిటివ్ అనే మ్యాగజైన్‌ను ఉపాసన నిర్వహిస్తున్నారు. ఈ మ్యాగ‌జైన్ కోసం నిర్వహించిన ఫోటో షూట్‌లో చిరంజీవి పాల్గొన్నారు. ఈ మ్యాగజైన్ తాజా ఎడిషన్‌ కోసం చిరంజీవితో ఉపాసన ఇంటర్వ్యూ నిర్వహించారు.
 
ఇందుకోసం నిర్వహించిన ఫోటోషూట్ కోసం తన మామగారిని కుర్రపిల్లోడిలా మార్చేశారు. 80 దశకంలో కనిపించిన చాకులాంటి చిరంజీవి ఇపుడు మళ్లీ కనిపించారు. సింపుల్ హెయిర్‌స్టైల్, కళ్ళకు జోడు, స్లిమ్ లుక్‌తో చిరంజీవి తన వయసును డామినేట్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలు చూసిన ఎవరైనా సరై.. చిరంజీవి వయసు 63 అంటే ఏ ఒక్కరూ నమ్మబోరని అంటున్నారు. పైగా, ఉపాసన కూడా ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. చిరంజీవి ఎప్పటికీ నిత్య యవ్వనుడే అంటూ ట్వీట్ చేసింది. 
 
అంతేనా, బీ-పాజిటివ్ మ్యాగజైన్ కోసం ఎంతో స్ఫూర్తిదాయకమైన ఇంటర్వ్యూ ఇచ్చారనీ, ఈ పత్రిక కవర్ పేజీపై ఆయన లుక్ చూస్తే కళ్లు జిగేల్మంటాయంటూ పేర్కొంది. కాగా, ఈ ఫోటో షూట్‌ను ప్రఖ్యాత సెలెబ్రిటీ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ నిర్వహించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు