మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని... చిరు 150వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తమిళ కత్తి రీమేక్‌గా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమాకు ఇప్పటికే "ఖైదీ నెంబర్ 150'' అనే పేరును ఖరారు చేసిన నేపథ్యంలో.. ఆయన ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 150వ సినిమా ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు.